Quotes in Telugu

  • Home
    • HOMEPAGE 1
    • HOMEPAGE 2
    • HOMEPAGE 3
    • HOMEPAGE 4
    • HOMEPAGE 5
  • Quotes Of The Day
  • Telugu Bhasha
  • Ram Karri
  • Contact
Ram Karri

About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...

Ram Karri Thursday, 16 April 2020 No Comments



రామ్ కర్రి గురించి - About Ram Karri





తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం, రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి, రచయిత, బ్లాగర్, సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు.

ఈయన  2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు, 

మరియు 

భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి.



జననం - విద్య

ఈయన  కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 న 1990 వ సంవత్సరం లో జన్మించారు...

ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగినది...



తెలుగు భాషా సంరక్షణ వేదిక



తెలుగు భాష అభివృధి కోసం పాటుపడే సామాన్యులలో ఈయన కూడా ఒకరు...

                  “ తెలుగుభాషా సంరక్షణ వేదిక ” అనే ఒక సంస్థ ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మన  తెలుగు భాష కి అలనాటి వైభవాన్ని తీసుకురావాలనే ఆకాంక్ష తో మన తల్లి భాషనీ మరచిపోతున్నా నేటి తరానికి అ,ఆ...నుండి వ్యాకరణం, పద్యాలు, పాటలు, కవితలు, కథలను మరియు ఆనాటి కవుల గురించి వాళ్ళ రచనల గురించి మరొక మారు గుర్తు చేసి, మన తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా ముఖ పుస్తకలలోను, సామజిక వెబ్సైటుల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అలాగేయ్ తెలుగు కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ...

  నేటితరం కవుల రచనలను మన ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక లో పొందుపరుస్తూ సమాజానికి పరిచయం చేస్తున్నారు.

అలాగే తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

వాట్సప్ లలో సమూహాలను ఏర్పరచి అభివృధి వైపుగా అడుగులు వెయ్యడం జరుగుతుంది...

రేపటి తరం మన తెలుగు గొప్పదనం తెలుసుకోవాలనే ఉద్యేశం తో తెలుగు భాషా సంరక్షణ వేదిక అనే వెబ్సైట్ ని రూపొందించి అందులో పొందుపరచడం జరుగుతుంది...

అలాగే తెలుగు గ్రంథాలయం ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతీ తెలుగు పుస్తకాన్ని పిడిఎఫ్ రూపంలో అందించి పుస్తక జ్ఞానాన్నీ చేకూర్చడం జరుగుతున్నది..

ఈ విధంగా ఆయన తెలుగు భాష అభివృధి కోసం  కృషి చేస్తున్నారు...



రామ్ కర్రి పబ్లికేషన్స్

అదే విధంగా నవ కవుల రచనలను రామ్ కర్రి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించడం జరుగుతున్నది..





రాంకర్రి జ్ఞాన కేంద్ర


మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద అయిన విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, భారతీయ సంస్కృతి - సంప్రదయాల్ని , నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని

మరియు
మన పూర్వీకుల నుండి మనం గ్రహించ లేకపోయిన మరెన్నో అద్భుతమయిన విషయాలను భావి తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో " రాంకర్రి జ్ఞాన కేంద్ర " అనే ఒక స్వచ్ఛంద సంస్థ ని స్వగ్రామం అయిన రాయవరం లో స్థాపించడం జరిగినది.

అటువంటి అద్భుతమైన విషయాలను ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు వారు పొందాలి అనే ఉధ్యేశం తో…

 ఆ సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.ramkarri.org   ద్వారా స్వచ్ఛందం గా అందించడం జరుగుతుంది…

అలాగే 276 వాట్సాప్ సమూహాలు మరియు టెలిగ్రామ్ గ్రూప్ ల ద్వారా కూడా ప్రజలకు ఈ అద్భుతమైన విషయాలను అందిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ - సంప్రదాయాలు, విజ్ఞానం , సనాతన ధర్మం , భారతీయ సిద్ధాంతాలు, నైతిక విలువలు అలాగే అనేక అద్భుతమైన విషయాలు అన్నీ ఒకే చోట లభిస్తున్నాయి కనుక ఈ వెబ్సైట్ ని " విలువల నిఘంటువు " అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు వీక్షకులు.



ప్రాణధాత ఫౌండేషన్


   
      " ప్రాణధాత ఫౌండేషన్ " అనే సేవా సంస్థ ని ఏర్పాటు చేసి, రక్త దాతలను సమాచారం అందివ్వడానికి వీలుగా జిల్లా ల వారిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, మరియు " ప్రాణధాత బ్లాగ్ " లో రక్త దాతల వివరాలను పొందుపరచడం జరిగినది.  

రక్తం అవసరమైన వాళ్ళు ఫోన్ చేయడానికి వీలుగా 8096339900 చరవాణి సంఖ్యను అందుబాటులో ఉంచి,

                 మన తెలుగు రాష్ట్రాలలోని వారికి ఎవరికైనా రక్తం అవసరం అయి పై నెంబర్ కి ఫోన్ చేసిన లేదా వాట్సాప్ లో సందేశం పంపిన వెంటనే ఆ సందేశాన్ని రక్త గ్రహిత యొక్క జిల్లాలో దగ్గరలో ఉన్నవారికి ఆ సమాచారం అందించి వాళ్ళచే రక్త దానం చేయించడం జరుగుతుంది.



వైద్య నిలయం 



            ఆరోగ్యమే మహాభాగ్యము మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవి కి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి సరియైన అవగాహన లేక చాలా బాధపడుతూ ఉంటారు.

                               వారి కోసం వైద్య నిలయం అనే వాట్సాప్ గ్రూపులను నడుపుతున్నారు అందులో నిపుణులు అయిన ఎందరో వైద్యుల్ని ని అడ్మిన్ గా నియమించి ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య, సందేహాలు ఉంటే దానిని సమూహం లో పెడితే వాటికి అనుభవజ్ఞులైన వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు.

అలాగే ఎన్నో ఆరోగ్య సూచనలను వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య నిలయం బ్లాగ్ ద్వారా అందిస్తున్నారు.



సాంకేతిక విజ్ఞానం

                     ప్రతీ తెలుగు వారు సాంకేతిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలనే తపనతో " సాంకేతిక విజ్ఞానం " అనే ఒక బ్లాగ్ ని తయారు చేసి తద్వారా సాంకేతిక పరమైన విషయాలను అచ్చమైన తెలుగు లో అందిస్తున్నారు.

అదే విధంగా విద్యార్థులకు సాంకేతిక పరమైన ఎన్నో సందేహాలకు అంతర్జాలం లోనే  సందేహ నివృత్తి చేస్తున్నారు...

     సాంకేతిక పరమైన విద్యలను తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరూ అభ్యసించాలి అనే ఆతృత తో అచ్ఛమైన తెలుగులోనే ఉచితం గా " సాంకేతిక విజ్ఞానం " ద్వారా అందిస్తున్నారు.



            తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళ సంఘం                   ( Telugu Lefties Club - TLC )


ప్రపంచం లో ఉన్న తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళందరినీ ఒక తాటి పైకి తీసుకొని వచ్చి , ఆలోచనలను పంచుకొని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసారు.. ఈ తెలుగు ఎడమ చేతి వాళ్ళ సంఘాన్నీ తెలుగు లెఫ్టిస్ క్లబ్ ( టి.ఎల్.సి )

ఈ సంఘం లో ఎడమ చేతి వాటం గల ప్రతీ తెలుగు వారిని చేర్చుకుంటున్నారు తద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు...



సమగ్ర భారతీయ తెలుగు కాలమాన సూచిక (జంత్రి)


                    మనం సమగ్రమైన భారత తెలుగు కాలమానాన్ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అనే ఆవేదనతో...

      మన భారతీయ కాలమానం (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం అని భావించిన ఆయన...

         తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో ప్రతీ సంవత్సరం ముద్రించి ఉచితంగా అందచేస్తున్నారు ఆయన.

                    ఇందులో  తెలుగు మొదటి నెల అయిన చైత్రం తో మొదలయ్యి, చివరి నెల అయిన పాల్గుణం తో ముగుస్తుంది... 

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి.

                       తిధుల ద్వారా గణింపబడిన ఈ భారతీయ తెలుగు కాలమాన సూచిక ను ( క్యాలెండర్ ) ని రూపొందిస్తున్నారు, ఇదే నిజమైన కాల సూచిక...

                      ప్రతీ సంవత్సరం ఈ భారతీయ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అనగా ఉగాది  పర్వదిననా విడుదల చేస్తున్నారు రామ్ కర్రి .




ఇలాంటి మరెన్నో సేవలను సమాజం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నారు...




వెబ్సైట్
 https://www.ramkarri.org/

వాట్సాప్ 
 https://wa.me/918096339900

          

యూట్యూబ్ 
http://www.youtube.com/c/RamKarri

వాట్సాప్ గ్రూప్స్ లింక్ 
https://cutt.ly/TeluguWhatsappGroup

టెలిగ్రామ్ గ్రూప్ 
https://t.me/RamKarri

లింక్డ్ ఇన్ 
www.linkedin.com/in/ursramkarri

ట్విట్టర్ 
https://twitter.com/UrsRamKarri


ఫేస్బుక్ 
https://www.facebook.com/UrsRamKarri


గూగుల్ మ్యాప్ 
https://g.page/RamKarri



చిరునామా 

రాంకర్రి జ్ఞాన కేంద్ర ,
1 - 240 , రాజ రాజేశ్వరీ కాలనీ ,
రాయవరం , రాయవరం మండలం ,
తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ - 533346







◆ ◆ ◆
Ram Karri

You May Also Like

Ram Karri
  • Next You are viewing Most Recent Post
Posted by Ram Karri at 03:45
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Ram Karri

No comments:

Post a Comment

Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Labels

  • About Food
  • About Truth
  • Ram Karri
  • Telugu Quotations - నేటి మంచి మాట
  • Telugu Quotes by Ram Karri
  • Usefull things for Life

Blog Archive

  • ▼  2020 (1)
    • ▼  April (1)
      • ▼  Apr 16 (1)
        • About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...
  • ►  2017 (2)
    • ►  June (2)
      • ►  Jun 20 (2)
  • ►  2016 (84)
    • ►  December (3)
      • ►  Dec 17 (3)
    • ►  November (81)
      • ►  Nov 20 (21)
      • ►  Nov 19 (30)
      • ►  Nov 18 (30)

Popular Posts

  • జీవిత ఉపయెాగాలు
    జీవిత ఉపయెాగాలు 1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి జ. గోరు వెచ్చనివి. 2.నీరు త్రాగేవిధానము జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3...
  • About Food : ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !
    ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ ! ------------------------------------------------------- 1.  ' శ...
  • Telugu Quotes by Ram Karri
    Telugu Quotes by Ram Karri
  • About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...
    రామ్ కర్రి గురించి - About Ram Karri తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం , రాయవరం గ్రామానికి చెందిన ...
  • Telugu Quotes by Ram Karri
    TELUGU QUOTATIONS  - నేటి మంచి మాట
  • Telugu Quotes by Ram Karri
    Telugu Quotations -  నేటి మంచి మాట
  • Telugu Quotes By Ram Karri - ఆకలి విలువ....
    Telugu Quotes By Ram Karri - ఆకలి విలువ....
  • Health Tips in Telugu By Ram Karri
    Health Tips in Telugu By Ram Karri
  • మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు
    💟🤔💟 మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు 12. వారి కళ్ళు మనుషులు ఎదుటి వార...
  • Telugu Quotes by Ram Karri
    TELUGU QUOTATIONS  - నేటి మంచి మాట
Created by - Way2themes - | Distributed By Gooyaabi Templates
  • HOME
  • CONTACT