జీవిత ఉపయెాగాలు

జీవిత ఉపయెాగాలు
1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి
జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.
మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి

మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు

💟🤔💟

మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు

12. వారి కళ్ళు

మనుషులు ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు చూపులు కలవడం చాలా సహజం. కానీ మనిషి అబద్దం చెప్పేటప్పుడు ఐతే అదేపనిగా కళ్ళలోకి చూస్తూ ఉంటారు లేకపోతే అసలు కళ్ళలోకి చూడకుండా దిక్కులు చూస్తూ మాట్లాడతారు. అలా కళ్ళలోకి చూస్తూ అబద్దం చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఈసారి వారి కళ్ళని గమనించడం మర్చిపోవద్దు.

11. గుటకలు మింగడం

మీరు పిల్లలు చూసే కార్టూన్లు చూస్తారా? అందులో అవి ఏమైనా ప్రమాదంలో ఉన్నప్పుడు గట్టిగా వినిపించేలా గుటకలు మింగినట్టు చూపిస్తారు. మనుషులు కూడా అంతే. అబద్దాలు చెప్పేటప్పుడు గుటకలు మింగడం, దగ్గడం లాంటివి చేస్తారు. అబద్దం చెప్పడం వల్ల మనలో టెన్షన్ వస్తుంది. అది పైకి కనపడనీయకుండా ఇలా చేస్తారు.

10. తల

అబద్దం చెప్పే అప్పుడు మనిషి తను చెప్పే మాటకి విరుద్దంగా తలని ఊపుతాడు. అవును అన్నప్పుడు కాదు అన్నట్టు, కాదు అన్నప్పుడు అవును అన్నట్టు, సంబంధం లేకుండా తల ఊపుతారు. అంతే కాకుండా తల ఊపడానికి ముందు కాస్త తటపటాయిస్తుంటారు. అబద్దం చెప్తున్నామనే కంగారు వల్ల ఇలా జరుగుతుంది.

9. ముక్కు

అబద్దాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళకి కొన్ని వింత అలవాట్లు కూడా ఉంటాయి, ఉదాహరణకి వారు అబద్దం చెప్పే అప్పుడు తరచూ ముక్కుని గోకడం చేస్తారు. ఇలాంటి అలవాట్ల వల్ల అబద్దం చెబుతున్నారని మనం తెలుసుకోవచ్చు.

8. నోరు

అబద్దం చెప్పాలనుకున్నపుడు మనుషులు తెలియకుండానే నోరు మూసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరకంగా మన మెదడు మనల్ని అబద్దం చెప్పకుండా ఆపుతున్న సంకేతం అది. నోరు గట్టిగా మూసుకోవడం, పెదాలు కొరుక్కోవడం, పెదాలు గట్టిగా బిగించి పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు గమనించండి.

7. ముఖ కవళికలు (Expressions)

ఒక్కోసారి మన ముఖంలో చిన్న తేడాతో మనం నిజం చెప్తున్నామా అబద్దం చెప్తున్నామా ఇట్టే కనిపెట్టేయచ్చు. ఓ చిన్న మార్పు. కనుబొమ్మలు పైకి ఎత్తడం లాంటివి. ఆ చిన్న మార్పుని గమనించండి. అబద్దం చెప్పేవారికి తప్పకుండా భయం ఉంటుంది. భయాన్ని ముఖంలో కనపడకుండా చేయడం చాలా కష్టం. కాబట్టి వారి ముఖంలో భయం కనపడుతుందో లేదో చూస్తూ ఉండండి.

6. ఊపిరి 

అబద్దం చెప్పే వారు అప్పుడే పరిగెత్తినట్టు ఆయాసపడుతూ ఉంటారు. వేగంగా గాలి పీల్చడం చేస్తారు. ముందు చెప్పినట్లు మనలోని భయం దీనికి కారణం.

5. చెప్పిందే చెప్పడం

వారు చెప్పిన అబద్దాన్ని ఎలా అయినా నమ్మించాలని చెప్పిందే మళ్ళి మళ్ళి చెబుతూ ఉంటారు. మామూలుగా మాట్లాడినట్లు కాకుండా చాలా విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు.

4. గొంతు

వేగంగా మాట్లాడడం, లేకపోతే చాలా నెమ్మదిగా మాట్లాడడం కూడా అబద్దం చెబుతున్నారు అన్నదానికి సంకేతాలే.ఈ చిన్న చిన్న గుర్తులతోనే అబద్దాలు ఆడేవారిని పట్టుకోవచ్చు.

3. ఎక్కువ చేసి చెప్పడం.

సాధారణంగా ఒక అబద్దం చెప్పాకా దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఏవేవో కల్లబుల్లి మాటలు చెప్తారు. ఉన్నవి లేనివి అన్ని కలిపి మీలో ఆశ్చర్యం కలిగించి అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు.

2. చేతులు

మాములుగా మాట్లాడేటప్పుడు మన చేతులు అంతగా చురుకుగా ఉండవు. అదే అబద్దం చెప్పేటప్పుడు మాత్రం రకరకాలుగా చేతులు ఊపుతూ ఉంటారు. అంతే కాకుండా పైన చెప్పినట్టు ముక్కు, నోరు, చెవులు గోక్కుంటూ ఉంటారు. ఇవన్నీ మనిషి ఒత్తిడిలో ఉన్నాడు అని చెప్పడానికి సంకేతాలు. అబద్దం చెప్పేటప్పుడు సాధారణం కంటే అధిక ఒత్తిడిలో ఉంటారు.

1. తప్పించుకోడానికి చూడడం

సాధారణంగా మాట్లాడే సమయంలో మన ఎదుటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువ సేపు మాట్లాడాలంటే దగ్గరగా ఉండాలి కాబట్టి అబద్దం చెప్పే వ్యక్తులు త్వరగా వారు ఉన్న ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. మాటలు పొడిగించకుండా వారు చెప్పాలనుక్కున్నది చెప్పేసి వెంటనే అక్కడనుండి వెళ్ళిపోతారు. 

చూసారుగా మిత్రులారా అబద్దం చెప్పే వ్యక్తుల హావ భావాలని మనం గమనించి వారి మోసం నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ఈ వ్యాసం రాసాను. మీకు ఈ పోస్టు నచ్చితే మీ స్నేహితులకి తప్పకుండా షేర్ చెయ్యండి.

💟😎💟😎💟😎💟😎💟😎💟

About Food : ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !

' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !

-------------------------------------------------------

1.  ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో  ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి

  " వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే పంట కోసుకోవాలని  తొందర పడటంలేదు !

రాశులుగా పోసిన  ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు !

గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత  పడటంలేదు . ధాన్యం బస్తాలు

ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .రామరాజ్యంలో

ఎవరికీ తిండికరువూ , దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు !
( మహర్షి వాల్మీకి )

2. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే !
  
   ( మహాత్మా గాంధీ ) .

3. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !

  ( జంధ్యాలగారు ) .

4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

5. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

6. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

7. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )

8. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

9.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు ).

10. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .

11 .మీ పిల్లలు ఎంత దూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు
మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు !
🌴🌱🌾🍁🍂🍃🎋🎋🌿
    సంపత్ పటేల్ 🌹🌻🌺🌸💐🌼