Quotes in Telugu

  • Home
    • HOMEPAGE 1
    • HOMEPAGE 2
    • HOMEPAGE 3
    • HOMEPAGE 4
    • HOMEPAGE 5
  • Quotes Of The Day
  • Telugu Bhasha
  • Ram Karri
  • Contact
About Food

About Food : ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !

Ram Karri Saturday, 17 December 2016 No Comments

' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !

-------------------------------------------------------

1.  ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో  ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి

  " వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే పంట కోసుకోవాలని  తొందర పడటంలేదు !

రాశులుగా పోసిన  ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు !

గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత  పడటంలేదు . ధాన్యం బస్తాలు

ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .రామరాజ్యంలో

ఎవరికీ తిండికరువూ , దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు !
( మహర్షి వాల్మీకి )

2. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే !
  
   ( మహాత్మా గాంధీ ) .

3. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !

  ( జంధ్యాలగారు ) .

4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

5. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

6. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

7. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )

8. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

9.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు ).

10. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .

11 .మీ పిల్లలు ఎంత దూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు
మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు !
🌴🌱🌾🍁🍂🍃🎋🎋🌿
    సంపత్ పటేల్ 🌹🌻🌺🌸💐🌼

Ram Karri

You May Also Like

About Food
Posted by Ram Karri at 19:53
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: About Food

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Labels

  • About Food
  • About Truth
  • Ram Karri
  • Telugu Quotations - నేటి మంచి మాట
  • Telugu Quotes by Ram Karri
  • Usefull things for Life

Blog Archive

  • ►  2020 (1)
    • ►  April (1)
      • ►  Apr 16 (1)
  • ►  2017 (2)
    • ►  June (2)
      • ►  Jun 20 (2)
  • ▼  2016 (84)
    • ▼  December (3)
      • ▼  Dec 17 (3)
        • జీవిత ఉపయెాగాలు
        • మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడాని...
        • About Food : ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల ...
    • ►  November (81)
      • ►  Nov 20 (21)
      • ►  Nov 19 (30)
      • ►  Nov 18 (30)

Popular Posts

  • జీవిత ఉపయెాగాలు
    జీవిత ఉపయెాగాలు 1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి జ. గోరు వెచ్చనివి. 2.నీరు త్రాగేవిధానము జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3...
  • About Food : ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !
    ' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ ! ------------------------------------------------------- 1.  ' శ...
  • Telugu Quotes by Ram Karri
    Telugu Quotes by Ram Karri
  • About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...
    రామ్ కర్రి గురించి - About Ram Karri తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం , రాయవరం గ్రామానికి చెందిన ...
  • Telugu Quotes by Ram Karri
    TELUGU QUOTATIONS  - నేటి మంచి మాట
  • Telugu Quotes by Ram Karri
    Telugu Quotations -  నేటి మంచి మాట
  • Telugu Quotes By Ram Karri - ఆకలి విలువ....
    Telugu Quotes By Ram Karri - ఆకలి విలువ....
  • Health Tips in Telugu By Ram Karri
    Health Tips in Telugu By Ram Karri
  • మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు
    💟🤔💟 మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు 12. వారి కళ్ళు మనుషులు ఎదుటి వార...
  • Telugu Quotes by Ram Karri
    TELUGU QUOTATIONS  - నేటి మంచి మాట
Created by - Way2themes - | Distributed By Gooyaabi Templates
  • HOME
  • CONTACT